ప్రచురణలు


ప్రముఖ సినీ, రంగస్థల కథా రచయిత శంకరమంచి పార్ధసారధి కథల సంపుటి "అద్దంలో మనం" ఇటీవల విడుదలయింది.

For Copies : Sankaramanchi Publications

H.No.1-1-336/121, Flat No.201

Street No.10, Vivek Nagar, Chikkadapally

Hyderabad-500020

PH : + 91 9000917274

Book Cost : Rs.200/- USD : 10$

మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి.

 

 

వెబ్ సైటు ప్రారంబోత్సవ దృశ్యాలు


హాస్య విరించి - శంకరమంచి...

దైనందిక వత్తుళ్ళనుండి మనిషిని బయటపడేసే గుప్పెడు వినోదం అందించేందుకు హాస్యాన్ని అందించిన భావుకుడు మన శంకరమంచి పార్థసారధి.

కథా, నాటక, సినీ రంగాల్లో రచయితగా సాఫల్యం సిద్దించుకున్నారు శంకరమంచి. జీవనసత్యాలకు హాస్యం రంగరిస్తూ వేదికలు, పత్రికలు, రేడియో, బుల్లి తెర, వెండి తెరవంటి కళామాధ్యమాల్లో ఆయన విరివిగా రచనలు చేసారు. అసంఖ్యాక అభిమానుల్ని సంపాదించుకున్నారు.

శంకరమంచి పార్థసారధి చేసిన సినిమాలు

జీవితానుభవం, నిశిత పరిశీలన, సునిశిత హాస్యం, మేథోమధనాలతో ఆయన సాగించిన అక్షరయజ్ఞం తెలుగువారి మనసుల్ని సదా ఆనందరసభరితం కావిస్తూనే ఉంటుంది. ఆయన కథలు మధ్యతరగతి జీవితం, స్త్రీ సమస్యలను ప్రధానంగా తీసుకున్నవైతే నాటకాలు, సినిమాలు మాత్రం వినోదంతో కూడిన హాస్యపు విరి జల్లులు. ఈ వెబ్‌సైటులో శంకరమంచి సాహిత్యం గురుంచిన వివరాలు విశేషాలతో పాటు ఉచితంగా ఆయన రచనలు మొత్తం చదువుకునే సౌకర్యం ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారికి శంకరమంచి అందిస్తున్న అపురూప కానుక ఈ వెబ్‌సైటు.

కథలు

1978 శంకరమంచి మొదటి కథ స్వాతిలో ప్రచురితమయ్యింది. ఇప్పటి వరకూ దాదాపు 200 లకి పైగా కథలు స్వాతి, ఆంధ్రజ్యోతి, ఆంధ్రభూమి, చతుర, ఉదయం వంటి అన్ని వార మాస పత్రికల్లో ప్రచురితమయ్యాయి. ఆంధ్రజ్యోతి, స్వాతి, ఉదయం పత్రికల్లో కథలకు బహుమతులు అందుకున్నారు.


నాటకాలు

ప్రేక్షకుల పెదవులపై నవ్వుల దొంతరలు, హాస్యపు గిలిగింతలు, చప్పట్లు, సగటు మనిషి మనస్సులో నిండే సంతోషం శంకరమంచి హాస్యరచనలకి స్పూర్తినిస్తూ వస్తోంది. తాను రాసిన నాటకాన్ని ప్రేక్షకులు అస్వాదిస్తూంటే కలిగే అనుభూతి అపురూపమాయనకు. ఇప్పటివరకూ 13 నాటికలు 2 నాటకాలు రాసారు శంకరమంచి.

సినిమాలు

తెలుగు సినీరంగంలో శంకరమంచి మొత్తం 15 సినిమాలకు పనిచేసారు. రేలంగి నరసింహారావు, వంశీ, జంధ్యాల, సింగీతం శ్రీనివాసరావు వంటి మహామహుల చిత్రాలకు రచనలందించారు. ఎదురింటి మొగుడు పక్కింటి పెళ్ళాం, ఔను వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు, గోపి గోపికా, గోదావరి, సరదాగా కాసేపు, అప్పుచేసి పప్పుకూడు