సినిమాలు

సినీరంగంలో శంకరమంచి మొత్తం 15 సినిమాలకు పనిచేసారు. అందులో పలు చిత్రాలు సూపర్ హిట్ అయ్యాయి. రేలంగి నరసింహారావు, వంశీ, జంధ్యాల, సింగీతం శ్రీనివాసరావు వంటి మహామహుల చిత్రాలకు రచనలందించారు. ఎదురింటి మొగుడు పక్కింటి పెళ్ళాం, ఔను వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు, గోపి గోపికా, గోదావరి, సరదాగా కాసేపు, అప్పుచేసి పప్పుకూడు మొదలైన సినిమాలు శంకరమంచికి విజయవంతమైన సినీ రచయితగా పేరు తెచ్చిపెట్టాయి.