రేడియో, టి.వి
అనేక రేడియో, టి.వి. నాటికలు, టి.వి. సీరియల్స్ రాసారు శంకరమంచి. వీరి రేడియో నాటికకు జాతీయ స్థాయిలో ప్రధమ బహుమతి లభించింది. శంకరమంచి కలంనుండి జారువారిన రచనల్లో పలు టి.వి. సీరియల్స్ ఉన్నాయి. ఈ టి.వి., జెమిని టి.వి. దూరదర్శన్ లలో ఇవి వచ్చాయి. జెమిని టి.వి. లో వచ్చిన శంకరమంచి విరచిత "సీతారాముల సినిమాగోల" నంది అవార్డు కైవసం చేసుకుంది. ఈ టి.వి.లో ప్రసారమయిన "పోపుల పెట్టి" సీరియల్ కి హాస్యబ్రహ్మ జంధ్యాల దర్శకుడు కాగా శంకరమంచి రచయితగా పనిచేయడం విశేషం.